
సంస్కృతి (4)
సంస్కృతి (ఆంగ్లం Culture) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన Culture లాటిన్ పదం cultura లేదా colere అనేవి "to cultivate" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు మరియు నిర్మాణాలు మరియు వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.
ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి
ఏ జాతికైనా సంస్కృతిని ప్రతిబింబించేవి పండుగలే. అలాంటి పండుగల్లో 'సంక్రాంతి' ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి పుష్యమాసంలో వచ్చే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఆ రోజునుంచి ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. అంటే సూర్యుని ప్రయాణం ఉత్తరదిశగా సాగుతుంది.
ప్రపంచంలో అతి ప్రాచీన సంస్కృతి భారతీయ సంస్కృతి. యుగ యుగాల హిందూ విజ్ఞాన సంకలనమే ఈ మహోన్నత సంస్కృతి. అనాదిగా ఎన్నో అవాంత రాలను తట్టుకుని ఉత్కృష్టమైన స్థానాన్ని పొంది నూతన తేజస్సుతో ప్రపంచ నలుమూలలా తనకీర్తి పతాకాన్ని రెపరెప లాడించిన మహా సంస్కృతియే భారతీయ సంస్కృతి.
జాతీయత అనేది రాష్ట్రానికి లేదా దేశా నికి సంభందించినది. దీనికంటూ చరిత్ర, భాష, వుంటాయి. ఒకే ప్రభుత్వానికి చెందినదై వుంటుంది. కొందరు సముదాయంగా ఏర్పడి వారికంటూ ఒక సంస్కృతిని కలిగి వుంటారు.
ఆహార౦ ప్రాణ౦ నిలుపుకోవటానికే ఐనా, కమ్మనైన రీతిలో తినడమే ఒక జీవితావసర౦గా మన ఆహార అలవాట్లు రూపొ౦దాయి.
Stay Connected with TAGKC
MORE ARTICLES
- ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల Be the first to comment!
- సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు Be the first to comment!
- మానవతా పరిమళ ప్రవాహం సినారె కవిత్వం Be the first to comment!
- హరికథ-ఆవిర్భావం Be the first to comment!
- తొలి తెలుగు శాసనం ఎక్కడ? Be the first to comment!
- తెలుగు సాహిత్యోద్యమనేత సురవరం ప్రతాపరెడ్డి Be the first to comment!
Galleries
Who's Online
We have 75 guests and no members online