ఉదాహరణకు ఉత్తర అమెరికాలోని రెడ్ ఇండి యన్ నేషన్, యూదుల ఇజ్రా యిల్ ప్రాంతాలు.
జాతీయతే దేశభక్తి
జాతీయత అనేది దేశ భక్తిని ప్రేరేపిస్తుంది. ఆ దేశ ప్రజల స్వే చ్చా éజీవనాన్ని, సంస్కృతీ సంప దను ఇనుమడింప చేస్తుంది. వ్యక్తులు లేదా ఆ సముదాయం లో ఐక్యత కానవస్తుంది. భారత దేశంలో హిందు వులు, ముస్లిం లు, సిక్కులు, క్రైస్తవులు, వెనుకబ డిన తరగతులు, దళితులు ఇలా ఎన్నో రకాల ప్రజలున్నా అంతా భారతీయులే. జాతీయత అంటే అభివృద్ధికి ముడిపడింది. నేడు జి-8 దేశాలలో భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆ దేశాలు కూడా భారతదేశంలో పాశ్చాత్యుల పాలన నుండి విముక్తి పొందాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాయి. విధ్వంసం నుండి అభివృద్ధి దశలో పయనించాయి.
జపాన్‌లో పని సంస్కృతి
భారతదేశంలో జనాభా ఎక్కువే. జపాన్‌లో జనాభ భారత్‌కంటే ఎక్కువైనా ఈ దేశం భారత్ కంటే అభివృద్ధిలో శర వేగంగా దూసుకుపోయింది. వారిలో దేశభక్తి, జెన్ బుద్ధీజమ్ సంస్కృతీ, సంప్రదా యాలు బాగా కానవస్తాయి. హిరోషిమా నాగసాకి బాంబుల బూడిద నుండి ఫినిక్స్ పక్షిలా లేచి వైభ వాన్ని చాటింది ఆ జాతి. జపాన్ లో పని సంస్కృతికి పెట్టింది పేరు.
పరిశ్ర మలలో మేనేజ్మెంట్ విధానాలు నచ్చకపోతే, వారితో మాట్లాడకుండా తమ వ్యతిరేకతను నల్ల బ్యాడ్జీలు వేసుకొని పనిని కొన సాగిస్తారు. ఉత్పత్తిని మరింత పెంచుతారు. ఎప్పుడూ పరిశ్రమల గేట్లూ మూయరు. పని ఆపరు.
వేషం, భాష వేరైనా...
సంస్కృతి అంటే కళలు, ఆచారాలు, సంప్రదాయాలు, మేధోపర అభివృద్ధి, జీవ నశైలి. దిగెజెటర్ ఆఫ్ ఇండియా హిందు మతాన్ని జీవన విధానమన్నది. భారతీయ సంస్కృతి ఎన్నో ఆటు పోట్లను చవి చూసింది. హిందుమతం సహనానికి మారు పేరు. వారి నమ్మకాలు, విశ్వాసాలు వేరైనా అన్యోన్యత కానవస్తుంది.
భారతదేశంలోని ముస్లిం, క్రైస్తవులలో అత్యధికులు మతం మారినవారే. ఇప్పటికే మతం మారినా కొందరు పాత సంస్కృతీ, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. వారి వేషం, భాష, ఆహారపు అలవాట్లు వేరైనా అం తా భారతీయులే. ఇప్పటికీ వివిధ కులాలు, అనేక వర్గాలున్నా కుంభమేళాలు, పుష్కరాలు, తిరునాళ్లు, జాతర్లలో అందరూ ఒకే చోట కలుస్తారు.
వసుధైవ కుటుంబకం
భారతీయ నాగరికత ప్రపంచంలో ఎంతో పురాతనమైనది. చరిత్ర పురాతత్వ శాస్త్రాలను పరికిస్తే ఇదే అవగతమవుతుంది. భారతీయ సంస్కృతి ప్రభావం ప్రపంచం లోని పలు దేశాలలో కాన వస్తుంది. 'ఏ దేశమేగినా పొగ డరా నీ తల్లి భారతి' చందాన ఈనాడు ఆసియా ఖండంలోని దేశాలేకాక పలు ప్రపంచ దేశా లలో భారతీయ సంస్కృతికి ఎం తో ప్రాధాన్యత ఇస్తారు. చైనా, ధాయ్‌లాండ్, మలేషియా, బర్మా, ఇండోనేషియా, జావా, సుమాత్ర, జపాన్దేశాలలో భార తీయ సంస్కృతి ప్రస్ఫుటంగా కాన వస్తుంది.
ఖోటాన్లో అశోకుని తన యుని ఏలుబడి కారణంగా బౌద్ధమతం ప్రభావం వుంది. మధ్య ఆసియా రోమ్ నుండి చైనా వరకు సమావేశ స్థలం గాపేరు వచ్చింది. జామి అభివృద్ధి ఆయా దేశ ప్రజల దేశ భక్తిని బట్టి వుంటుంది. దక్షిణ కొరియా, ఉత్తరకొరియాలు చిన్నవైనా వారి దేశభక్తి కారణాన అభివృద్ధి దశలో పయ నించారు. దేశభక్తికి విఘాతం కల్గించే చర్యలను మొగ్గలోనే అణచి వేయాలి.
యూదుల సంస్కృతి పరి రక్షణకు ఆదేశస్తులు ఎంతగానో శ్రమిస్తారు. హిబ్రూ భాష పరి రక్షణకు నడుం బిగిస్తారు. వారు ఎక్కడ వున్నా సైనోగోగ్లకు వెళ్లెదరు. మనదేశంలో గుం టూరు, కొచ్చి, ముంబైలో సైనోగోగ్లున్నాయి. అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో యూదులు కీలక పాత్ర వహిస్తారు.
వారు ఏదేశంలో వున్నా వారి సంస్కృతీ పరిరక్షణకై కొంత డబ్బును వెచ్చిస్తారు. వారి దేశ రక్షణకు బాల్యం నుండి మిలిటరీలో చేరెదరు. జెరూ సలేం అటు క్రైస్తవులకు, ముస్లింలకు పవిత్ర ప్రాంతం. ఆలక్షా మసీదుకు, జెరుసలేంలోని జీసస్ జన్మస్థలాన్ని ప్రపంచంలోని పలు ప్రాంతాల ముస్లింలు, క్రైస్తవులు సందర్శిస్తారు.
- దండు కృష్ణవర్మ
http://www.prabhanews.com/tradition/article-218768